ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఖర్చును కులాలవారీగా విభజించి చూపడం చేతగానితనానికి నిదర్శనమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. సాధారణంగా ఖర్చుపెట్టిన దానిని సబ్‌ప్లాన్‌లో చూపించే దిగజారుడు ఎకనామిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
'దిగజారుడు ఎకనామిక్స్‌కు పాల్పడుతున్నారు' - కూల్చివేసిన ప్రజావేదిక తాజా వార్తలు
సీఎం జగన్ ప్రతి ఖర్చును కులాలవారీగా విభజించి చూపడం చేతగానితనానికి నిదర్శనమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. వైకాపా ఏడాది పాలనలో అవినీతి, అసమర్థతకు నిరసనగా కూల్చివేసిన ప్రజావేదిక వద్ద గురువారం నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.
వైకాపా ఏడాది పాలనపై రేపు కూల్చివేసిన ప్రజావేదిక వద్ద నిరసన
వైకాపా ఏడాది పాలనలో అరాచకం, అవినీతి, అసమర్థతకు నిరసనగా కూల్చివేసిన ప్రజావేదిక వద్ద గురువారం నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజావేదిక కూల్చి ఏడాది గడుస్తోందని... ప్రభుత్వ అరాచకం ఈ చర్యతోనే ప్రారంభమైందని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.