MLC Ashok babu On Employees Protest:ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు కోరారు. ఉద్యోగుల సమస్యలపై సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం అని నిలదీశారు. ప్రభుత్వం బడ్జెట్ అంతా ఉద్యోగుల జీతాలకే ఇస్తున్నట్టు చిత్రీకరిస్తున్నా.., ప్రజలు నమ్మటం లేదన్నారు. నిన్న జరిగిన ఉద్యమంలో పోలీసులను తప్పు పట్టడం సరికాదన్నారు. పోలీసులు మాత్రం ఉద్యోగులు కాదా ? వారికి జీతాలు తగ్గిస్తే ప్రభుత్వానికి ఎందుకు సహకరిస్తారని ప్రశ్నించారు.
రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయాం..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీ నేతల స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం విలేకర్లతో నేతలు మాట్లాడారు. వేతన సవరణ తేదీకి అమలు తేదీకి ప్రభుత్వాలు వ్యత్యాసం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఎప్పుడూ మధ్యంతర భృతి వెనక్కి తీసుకోలేదని సూర్యనారాయణ గుర్తు చేశారు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పు అని మాకు తెలియదని చెప్పారు. మధ్యంతర ఉపశమనం ఏ రకంగా రుణంగా కనిపించిందో అధికారులు చెప్పాలని పేర్కొన్నారు. ఐఏఎస్‌లా గొప్ప చదువులు చదవకపోయినా ఇది సాధారణ లెక్కలేనని ప్రతి ఉద్యోగికీ తెలుసునన్నారు. ఐఆర్ జీవోలో ఒక తరహాగా గత పీఆర్సీలో ఒకలా ఉండటం తప్పుదోవ పట్టించడమే అవుతుందని చెప్పారు. జీవోను నిలుపుదల చేయాలని చెప్పినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు.అవగాహనరాహిత్యం ఎవరిదో ప్రభుత్వమే అర్థం చేసుకోవాలని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. కేంద్ర పే కమిషన్‌కు వెళ్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
సమస్యను జఠిలం చేస్తున్నారు..