రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కొత్త నియామకాలు, రాజకీయాలు చేయడం తగదని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఆయన.. కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు బయటపెట్టాలన్నారు. జెట్ స్పీడ్తో సస్పెన్షన్లు, నియామకాలు చేస్తున్న ముఖ్యమంత్రి... అదే జెట్ స్పీడ్తో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి పీపీఈ సూట్లు ఇవ్వాలని గోరంట్ల డిమాండ్ చేశారు.
'జగన్ గారూ.. కరోనా సమయంలో నియామకాలు, సస్పెన్షన్లు ఏంటి..?' - Gorantla Buchaiah Chowdary tweeter news
కరోనా సమయంలో ఈ నియామకాలు... రాజకీయాలు ఏంటో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఇంత జెట్ స్పీడ్తో సస్పెన్షన్లు, నియామకాలు చేస్తున్న ముఖ్యమంత్రి... అదే జెట్ స్పీడ్తో వైద్య సిబ్బందికి పీపీఈ సూట్లు ఇవ్వాలని కోరారు.
వైద్య సిబ్బందికి పీపీఈ సూట్ ఇవ్వండి