పోలీసుల(police)పై వైకాపా ప్రభుత్వం(YCP Government) చిన్నచూపుతో ఉందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(MLA Anagani Satyaprasad) మండిపడ్డారు. పోలీసుల సమస్యలపై సీఎం జగన్(CM Jagan)కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
కానిస్టేబుల్, ఎస్సై స్థాయి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. డీఏ, టీఏ సకాలంలో ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవుల అమలుపై నివేదిక సమర్పించి రెండేళ్లవుతున్నా.. ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. కానిస్టేబుల్స్, ఏఎస్సై, ఎస్సైలకు పదోన్నతులు లేవని మండిపడ్డారు. సీఎఫ్ఎమ్ఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు పోలీసుల వేతనాలు, పింఛన్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.