ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముందుచూపు లేని వైద్యుల బదిలీలతో ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం: అనగాని

Anagani Letter To CM: రాష్ట్రంలో వైద్యులు, సిబ్బంది బదిలీలపై సీఎం జగన్​కు తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. బదిలీలతో తలెత్తే ఇబ్బందులు అంచనా వేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో బదిలీలు సమంజసమా అని ప్రశ్నించారు.

Anagani Letter To CM
సీఎం జగన్​కు తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ

By

Published : Apr 17, 2022, 9:27 AM IST

Anagani Letter To CM: రాష్ట్రంలో వైద్యులు, సిబ్బంది బదిలీలపై సీఎం జగన్​కు తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ముందుచూపులేని వైద్యుల బదిలీలతో ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని మండిపడ్డారు. బదిలీలతో తలెత్తే ఇబ్బందులు అంచనా వేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వల్ల రోగుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా అని నిలదీశారు.

కరెంటు కోతలతో ప్రభుత్వాసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వరుస శిశు మరణాలు, టార్చ్​లైట్ల వెలుతురులో ప్రసవాలు జరపాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో బదిలీలు సమంజసమా అని ప్రశ్నించారు. వైద్య రంగం బలోపేతంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలంటే వైకాపా ప్రభుత్వానికి లెక్కలేనితనంగా ఉందని మండిపడ్డారు.

ఇదీ చదవండి: అరకు లోయలో హరిత హననం

ABOUT THE AUTHOR

...view details