ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో భూ రిజిస్ట్రేషన్లు ఏ రకమైన ట్రేడింగ్​..?: అనగాని - repalle mla anagani sayaprasad news

రాజధానికి భూములిచ్చిన రైతులను 16 నెలలుగా వైకాపా ప్రభుత్వం మనోవేదనకు గురి చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని మండిపడ్డారు. విశాఖలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లు ఏ రకం ట్రేడింగో చెప్పాలని ఆనగాని డిమాండ్ చేశారు.

tdp-mla-anagani-criticize-ycp-govt
తెదేపా ఎమ్మెల్యే ఆనగాని సత్యప్రసాద్

By

Published : Sep 27, 2020, 12:05 PM IST


రాష్ట్ర ప్రజల గుండె అమరావతి అని కొట్టుకుంటుంటే... వైకాపా పెద్దల గుండెలు మాత్రం విశాఖ భూములు అని కొట్టుకుంటున్నాయని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వైకాపా చేస్తున్న తప్పులతో రాజధానికి భూములిచ్చిన రైతులు 16 నెలలుగా మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలింపుపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినా... మెట్రోరైలు ప్రాజెక్టు కార్యాలయాన్ని తరలించడం వైకాపా అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. కౌలు చెల్లించకుండా రైతులను ఏడిపించడం రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు.

ఇన్​సైడర్ ట్రేడింగ్ ఏ చట్టంలో ఉందో చెప్పాలి

ఇన్​సైడర్ ట్రేడింగ్ జరిగిందో లేదో వైకాపా తేల్చలేకపోయిందని.. భూములు కొంటే తప్పేంటని అనగాని ప్రశ్నించారు. భూములు కొనడాన్ని ఇన్​సైడర్ ట్రేడింగ్ అంటారని ఏ రెవెన్యూ చట్టంలో ఉందన్నారు. విశాఖలో 72 వేల భూ రిజిస్ట్రేషన్లు జరిగాయని... దీన్ని ఏ రకం ట్రేడింగ్ అంటారో వైకాపా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రకటన తర్వాత 127 ఎకరాలు మాత్రమే రాజధాని పరిధిలో రిజిస్ట్రేషన్లు జరిగాయని... మరి 4 వేల ఎకరాలు ఎక్కడ జరిగాయన్నారు. ఒకసారి గ్రాఫిక్స్ అని, మరోసారి కులం అంటగడుతున్నారని.... రెండూ లేకపోయేసరికి ఇన్​సైడర్ ట్రేడింగ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కన్నీళ్లు పెట్టించిన వైకాపా ప్రభుత్వం..వారి కన్నీళ్లలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు.

ఇదీ చదవండి:తాడి’ వాసుల కష్టాలు... ముందుకు సాగని గ్రామ తరలింపు

ABOUT THE AUTHOR

...view details