వైకాపా నేతల అండర్‌కవర్ అవినీతి, ఇసుక దోపిడితో రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఆన్ లైన్లో....ఇసుక నిమిషాల్లో ఖాళీ అవుతుంటే వైకాపా నాయకుల గుప్పెట్లో వేల టన్నులు ఎలా ఉంటోందని ప్రశ్నించారు. లక్షల లారీల ఇసుక తరలించినా స్టాక్ యార్డ్‌లో 20 వేలు కూడా చూపించడం లేదని దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను మళ్లీ ప్రారంభించడం, నిర్మించిన భవనాలకు వైకాపా రంగులు వేయడం, సంక్షేమ పథకాల పేర్లు మార్చడటమే...... ఏడాది పాలనలో వైకాపా సర్కార్ సాధించిన ఘనకార్యాలని ఎద్దేవా చేశారు.
'వైకాపా నేతల గుప్పెట్లో వేల టన్నుల ఇసుక ఎలా ఉంటోంది..?'
వైకాపా నేతలు ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్న ఆయన వారికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా