ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజల్లో మార్పు వచ్చింది.. చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారు: తెదేపా నేతలు

TDP Mini Mahanadu:ప్రజలు బుద్ధి చెబుతారని గుడివాడలో నిర్వహించిన తెదేపా మినీ మహానాడులో అయ్యన్న అన్నారు. రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్నారని వాపోయారు. ప్రజల్లో మార్పు వచ్చిందని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

TDP Mini Mahanadu
TDP Mini Mahanadu

By

Published : May 20, 2022, 4:27 PM IST

TDP Mini Mahanadu: కృష్ణాజిల్లా గుడివాడలో తెదేపా మినీ మహానాడు నిర్వహించింది. తెలుగుదేశం కోసం అవసరమైతే ప్రాణాలర్పిస్తానని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. జగన్మోహన్, కొడాలి నాని పెద్ద దొంగలని ఆరోపించారు. ఎన్టీ రామారావు మోచేతి నీళ్లు తాగిన కొడాలి నాని, నేడు చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా చేసిన నానికి ఆ శాఖ గురించి ఏమీ తెలియని ఎద్దేవా చేశారు. జగన్, కొడాలి నానిలకు ప్రజలు బుద్ధి చెబుతారని అయ్యన్న అన్నారు. మోసపూరితంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు.

మహానాడు ప్రతి తెదేపా కార్యకర్తకు పెద్ద పండుగలాంటిదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 151మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. గుడివాడ గడ్డని తెదేపా అడ్డాగా మారుస్తామని దివ్యవాణి తెలిపారు. గతంలో గుడివాడ అంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకు వచ్చేదని.. నేడు క్యాసినోవాడగా కొడాలి నాని మార్చారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, యరపతినేని శ్రీనివాసరావు, జయమంగళ వెంకటరమణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details