నాడు-నేడు దోపిడీ కార్యక్రమమని వైకాపా నేతలే కుండబద్దలు కొడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగమైన.. నాడు-నేడు కార్యక్రమంలో జరుగుతున్న అక్రమాల గుట్టును ఎంపీపీ విద్యాకమిటీ ఛైర్మన్‌గా ఉన్న బద్దెగం సుబ్బారెడ్డి రట్టు చేశారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో విద్యాశాఖ మంత్రి సురేశ్ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత సుబ్బారెడ్డి అక్రమాలు మొత్తం బయటపెట్టారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి.. పిల్లల పేరుతో వైకాపా నేతలు చేసిన కోట్ల రూపాయల అక్రమాల లెక్కలు బయటపడతాయన్నారు.
నాడు-నేడు అక్రమాల పుట్టని, విద్యార్థుల పాలిట శాపంగా మారిందంటే.. అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజకీయాలు చెయ్యొద్దని చెప్పిన విషయాన్ని లోకేశ్ ప్రస్తావించారు. ప్రైవేటు విద్యార్థి చనిపోతే లోకేశ్‌కు నష్టమేంటని చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు.