ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలో తెదేపా లోక్​సభ నియోజకవర్గ కమిటీల సభ్యుల నియామకం - తెేదపా లోక్ సభ నియోజకవర్గ కమిటీలు

తెదేపా... లోక్​సభ నియోజకవర్గ కమిటీల సభ్యులను త్వరలో నియమించనుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కమిటీల అధ్యక్షులను ప్రకటించిన పార్టీ.. మిగతా సభ్యుల నియోమకంపై కసరత్తు చేస్తోంది.

tdp lok sabha committees
త్వరలో తెదేపా లోక్​సభ నియోజకవర్గ కమిటీల సభ్యుల నియామకం

By

Published : Nov 21, 2020, 9:19 AM IST

తెలుగుదేశం పార్టీ... జిల్లా కమిటీలకు బదులుగా.. ఈసారి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ కమిటీల అధ్యక్షులను ఇప్పటికే ప్రకటించింది. కమిటీలో మిగతా సభ్యులనూ త్వరలో నియమించనుంది. ఒక్కో కమిటీలో అధ్యక్షుడు సహా 27 మంది సభ్యులుగా ఉంటారు. ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు అధికార ప్రతినిధులు, ఏడుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శులు ఉంటారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులూ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ అనుబంధ సంఘాల నియామకంపైనా కసరత్తు జరుగుతోంది. మొత్తం 18 అనుబంధ సంఘాలు ఉంటాయి. ప్రతి కమిటీలో అధ్యక్షుడు సహా 28 మంది ఉంటారు. ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు అధికార ప్రతినిధులు, ఏడుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శులు, నియోజకవర్గ అధ్యక్షుడు ఏడుగురు, ఒక సోషల్‌ మీడియా సమన్వయకర్త ఉంటారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీ అనుబంధ సంఘాల్లో తెలుగు మహిళ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని ఇప్పటికే నియమించారు.

ABOUT THE AUTHOR

...view details