ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని దగా చేశారు' - కేంద్ర బడ్జెట్​పై తెదేపా కామెంట్స్

కేసుల మాఫీ కోసం వైకాపా నేతలు రాష్ట్రాన్ని దగా చేశారని తెదేపా నేతలు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్​లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆక్షేపించారు. బ‌డ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అన‌లేని నిస్సహాయ‌స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారన్నారు.

మీ కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని దగా చేశారు
మీ కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని దగా చేశారు

By

Published : Feb 1, 2021, 9:12 PM IST

జనాన్ని మోసం చేసే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి రాష్ట్రాన్ని ద‌గా చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. బ‌డ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అన‌లేని నిస్సహాయ‌స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారన్నారు.

"25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడ‌లు వంచి మ‌రీ ప్రత్యేక హోదా సాధిస్తాన‌ని ఉత్తర‌కుమార ప్రగ‌ల్భాలు ప‌లికారు. తన 31 కేసుల నుంచి త‌ప్పిస్తే ప్రత్యేక హోదా ఊసెత్తన‌ని 28 ఎంపీలను కేంద్రానికి తాక‌ట్టు పెట్టారు. విభ‌జ‌న‌ చ‌ట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హామీల‌కు బాబాయ్ హ‌త్య కేసుతో కేంద్రం చెల్లు చేసింది. బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌క్కర్లేదు కానీ...సహనిందితులైన అధికారులను త‌న‌కు కేటాయిస్తే చాల‌ని కేంద్రం వ‌ద్ద సాగిల‌ప‌డ్డారు. అప్పులు వాడుకోవ‌డానికి అనుమ‌తిస్తే చాలు, ఏ ప్రాజెక్టులివ్వక‌పోయినా ఫ‌ర్వాలేద‌ని ఒప్పందం చేసుకున్నారు." అని ట్విటర్ వేదికగా లోకేశ్ దుయ్యబట్టారు.

కాళ్ళు పట్టేది, కాకా పట్టేది కేసుల మాఫీ కోసమే..

"ప్రధాని మోదీ వెనకాల కూర్చున్న గొప్పవాడిని అంటూ పీఆర్ టీంతో డబ్బాలు కొట్టుకుంటే...రాష్ట్రం కోసం భారీగా నిధులు తేవటానికి ఆయన వెనకాల కూర్చుని దువ్వుతున్నావ్ అనుకున్నాం. నువ్వు కాళ్ళు పట్టేది, కాకా పట్టేది, నీ కేసులు కోసం అని ఈరోజుతో తేలిపోయింది. కేంద్ర బడ్జెట్​లో, రాష్ట్రానికి కనీసం రూపాయి తీసుకుని తేలేని నువ్వు, నీ ఎచ్చు కబురులు ఎందుకు ? 22 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు కలిసి మీ కేసుల కోసం ఏపీని అమ్మేసారా ఏంటి ?" -అయ్యన్నపాత్రుడు

ఏపీకి మెట్రో ఊసే లేదు

రాష్ట్రానికి నరేంద్ర మోదీ ఇచ్చిన నిధులు అద్భుతమని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కృషి చేసిన వైకాపా ఎంపీలకు, ముఖ్యమంత్రి జగన్​కు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. మెట్రో రైలు కేటాయింపుల్లో ఏపీ ఊసేలేకుండా పోయిందని ట్వీటర్ వేదికగా మండిపడ్డారు.

ఇలా చేస్తే రాష్ట్రానికి నిధులేం వస్తాయి ?

"ఆ జడ్జిను తప్పించండి, ఈ జడ్జి మీద కేసు వేయండి, చంద్రబాబుపై సిబిఐ కేసు వేయండి" అంటూ రాజకీయ కక్ష తీర్చుకునే ఫ్యాక్షనిస్ట్ దిల్లీ పర్యటనలు చేస్తే రాష్ట్రానికి నిధులేం వస్తాయని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. సొంత కేసుల కోసం ఏపీని తాకట్టు పెట్టారని ఆక్షేపించారు.

ఇదీచదవండి

'బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనేది..?'

ABOUT THE AUTHOR

...view details