ప్రభుత్వం పంపిణీ చేసే ఉల్లి కోసం ప్రజలు గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సి వస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడ స్వరాజ్ మైదాన్ రైతుబజార్‌లోని ఉల్లి విక్రయ కేంద్రాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. వినియోగదారుల కష్టాలను అడిగి తెలుసుకున్న దేవినేని.. వృద్ధులు, మహిళలు కేజీ ఉల్లి కోసం పనులు మానుకుని రైతుబజార్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం స్పందించి విక్రయ కేంద్రాలు పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు గుడివాడలో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు .
ఉల్లి విక్రయ కేంద్రాలను పెంచాలి :తెదేపా నేతలు - tdp leaders visit raithubazar at vijayawada news
విజయవాడ స్వరాజ్ మైదాన్ రైతుబజార్‌లోని ఉల్లి విక్రయ కేంద్రాన్ని తెదేపా నేతలు పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే ఉల్లి విక్రయ కేంద్రాలను పెంచాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
tdp leaders visit raithubazars at vijayawada