ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VARLA RAMAIAH: 'సీఎం బంధువుపై వెంటనే చర్యలు చేపట్టాలి' - tdp leaders varlaramaiah reacted on akbar basha land issue

అక్బర్ బాషా పొలం కబ్జా చేసిన సీఎం బంధువుపై వెంటనే చర్యలు చేపట్టాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఐను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని కోరారు.

వర్ల రామయ్య, చినరాజప్ప
వర్ల రామయ్య, చినరాజప్ప

By

Published : Sep 11, 2021, 7:26 PM IST


మైదుకూరులో అక్బర్ భాషా పొలం కబ్జా చేసిన సీఎం బంధువుపై వెంటనే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

"సీఎం బంధువు అండ చూసి విర్రవీగిన సీఐ కొండారెడ్డిపై చర్యలెందుకు తీసుకోలేదు. తక్షణమే సీఐని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయటంతో పాటు ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. అక్బర్ బాషా గోడు వినిపించుకుని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డిని వెంటనే రీకాల్ చేయాలి. వీడియో వైరల్ చేయకుంటే అక్బర్ భాషా కుటుంబం చనిపోయి ఉండేది. ప్రజల్ని పోలీసులు, జగన్ రెడ్డి ప్రభుత్వం రక్షించట్లేదు. వీడియో రక్షితి రక్షత: అన్న రీతిలో ప్రజలు వీడియోలనే నమ్మకుంటున్నారు. సలాం వీడియోతో పాటు అక్బర్ బాషా వీడియోలపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందించాలి" అని డిమాండ్ చేశారు. -వర్ల రామయ్య, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు

జగన్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారు..

రాష్ట్రంలో వైకాపా రాబందుల చేష్టలు పెచ్చుమీరుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు.

"ముస్లిం మైనార్టీలపై దాడుల వెనుక ప్రభుత్వ పెద్దల అండ ఉంది. సీఎం సొంత జిల్లాలో సొంత పార్టీ కార్యకర్తకే నేతల అరాచకాలు తాళలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే ఎలా.. పోలీసుల్లో మార్పు రావాలి." అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -చినరాజప్ప, తెదేపా నేత

ఇదీ చదవండి:

గన్నవరం విమానాశ్రయంలో నిలిచిన ఎయిరిండియా విమానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details