మున్సిపల్ ఎన్నికల్లో పట్టణప్రాంత ప్రజలు ఆలోచించి అభ్యర్థులను ఎన్నుకోవాలని.. పలువురు తెదేపా నేతలు కోరారు.
ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేసింది. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తుంటే ఎందుకు భయపడుతోంది. పోలీసు వ్యవస్థను రాజకీయం కోసం అడ్డుపెట్టుకుంటున్న అధికార పార్టీ నేతలు నీచ సాంస్కృతిక విధానంలో వెళ్తున్నారు. - గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
- చంద్రబాబు తిరిగి సీఎం అవుతారన్న భయం.. జగన్‌లో మొదలైంది
చంద్రబాబు తిరిగి సీఎం అవుతారన్న భయం జగన్‌లో మొదలైందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. "జగన్ కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలి. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారనే నమ్మకం ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా మాలచుకోవాలి. దుష్టశక్తులపై పోరులో చంద్రబాబు వెనకడుగు వేయరనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి." అని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.