Tdp leader kala venkata rao slams on ysrcp: యజ్ఞంలా సాగుతున్న మహాపాదయాత్రను వైకాపా నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మండిపడ్డారు. తెదేపా హయాంలో సన్ రైజ్ స్టేట్‌గా ఏపీ ఉంటే... జగన్ అధికారం చేపట్టాక కరెప్షన్ రైజ్ స్టేట్‌గా మారిందని ధ్వజమెత్తారు. వైకాపా నేతలు అవినీతిలో మునిగి రాష్ట్రాన్ని అప్పులతో ముంచుతున్నారని ఆరోపించారు.
రైతులు సంకల్ప బలంతో 37 రోజులుగా సాగుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో వైకాపాకు గుబులుపుట్టిందని దుయ్యబట్టారు. కనీసం అన్నం తినడానికి కూడా స్థలాలు కేటాయించకుండా బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. తలదాచుకోవడానికి నీడ లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఏటా 2,500కోట్ల బాదుడుకు వైకాపా శ్రీకారం: పట్టాభి
Tdp leader pattabhi on Housing scheme: పేదల ఇళ్లస్థలాల ముసుగులో తాజాగా ఏటా రూ. 2,500కోట్ల బాదుడు కార్యక్రమానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగా ప్రతి లే అవుట్లో 5శాతం భూమి లేదా దాని ఖరీదుని ప్రభుత్వానికి చెల్లించాలని వైకాపా ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని 13జిల్లాల్లో 20వేల ఎకరాల్లో లే అవుట్లు వేస్తున్నారని.. ఆ లెక్కన 5శాతం భూమి అంటే 1000ఎకరాలు లేదా దాని విలువ రాబట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.