ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం గారూ.. ఇంటినుంచి ఏంటీ రియాలిటీ షోలు?: తెదేపా

ప్రభుత్వ వ్యవహార శైలి.. రియాలిటీ షోలా ఉందని తెదేపా నేతలు వ్యాఖ్యానించారు. దిల్లీ చుట్టూ సీఎం చక్కర్లు కొడుతున్నారని.. అసలు అక్కడ ఏం చేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

Devineni Uma

By

Published : Oct 20, 2019, 5:18 PM IST

గోదావరిలో బోటు ప్రమాదం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. మద్యం అమ్మకాల తాజా వ్యవహారంతో పాటు.. మరిన్ని అంశాలపై.. ప్రభుత్వ తీరును తెదేపా నేతలు తప్పుబట్టారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆక్షేపించారు. పోలవరం ప్రాజెక్టు పనులు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయన్న మాజీ మంత్రి దేవినేని ఉమ... పోలవరం, వెలిగొండ పనులు ఒక గుత్తేదారుకే దక్కాయని అన్నారు. వెలిగొండ పనుల టెండరింగ్‌లో రియాలిటీ షో జరుగుతోందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ ఇంట్లో కూర్చునే డ్రామాలు నడుపుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 4 నెలల్లో ఎవరెవరికి పెండింగ్‌ బిల్లులు చెల్లించారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. బోటు మునిగి నెల దాటినా బయటకు తీయలేకపోయారని ఆగ్రహించారు.

మీడియా సమావేశంలో తెదేపా నేతలు

సీఎం జగన్‌ దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.. దిల్లీలో ఏం చేస్తున్నారో మీడియాకు ఎందుకు చెప్పడం లేదనీ నిలదీశారు. ప్రభుత్వ దుకాణాల్లో రాత్రి 8 తరువాత వైకాపా కార్యకర్తలు లిక్కర్ అమ్ముతున్నారని ఆరోపించారు. ఇసుక విధానంలోనూ ప్రభుత్వ వ్యవహార శైలిని దేవినేని ఉమ సహా.. పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి, మరో నాయకుడు గురు నారాయణమూర్తి తప్పుబట్టారు. ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. పెండింగ్​లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details