జగన్‌ను ఓడించేందుకే ముందుకొచ్చే అందరినీ.. కలుపుకుని వెళ్తామని చినరాజప్ప, మంతెన సత్యనారాయణరాజు వివరించారు. ప్రజల్ని ఈ ప్రభుత్వం పెడుతున్న హింస నుంచి గట్టెక్కించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆకాంక్షించారు. పొత్తులు విషయం పార్టీ అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జగన్ రెడ్డిని ఓడించేందుకే ముందుకొచ్చే వారందరినీ కలుపుకుపోతామని వివరించారు.
పవన్‌కల్యాణ్ మాటలతో ఏకీభవిస్తున్నాం.. పొత్తులపై అధిష్టానానిదే నిర్ణయమన్న తెదేపా నేతలు - TDP leaders fires on ysrcp
TDP Leaders on Pawan kalyan statements: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే వైకాపా నేతలకు డిపాజిట్లు కూడా రావని తెదేపా నేతలు తేల్చిచెప్పారు. రాక్షస పాలన అంతమవ్వాలంటే అంతా కలసికట్టుగా పోరాడాలన్న పవన్ కల్యాణ్ మాటలతో ఏకీభవిస్తున్నామన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే వైకాపా నేతలకు డిపాజిట్లు కూడా రావు: తెదేపా