చంద్రబాబు పాలనలో..... సులభతర వాణిజ్యంలో ఏపీకి ప్రథమ స్థానం వస్తే.... విమర్శించిన సీఎం జగన్.. ఇప్పుడు మాత్రం సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క పరిశ్రమ, ఒక్క ఉద్యోగం రాలేదని విమర్శించిన జగన్.. ఇప్పుడు తెదేపా పాలనలో వచ్చిన పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై మాట్లాడుతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కృషివల్లే సులభతరం వాణిజ్యంలో ప్రథమ స్థానం: తెదేపా నేతలు - kala venkatrao news
సులభతరం వాణిజ్యంలో రాష్ట్రానికి ప్రథమ స్థానంపై తెదేపా నేతలు స్పందించారు. చంద్రబాబు కృషివల్లే రాష్ట్రానికి ప్రథమ స్థానం వచ్చిందన్న తెదేపా నేతలు...వైకాపా అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని విమర్శించారు.
చంద్రబాబు కృషి వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రానికి అగ్రస్థానం లభించిందని తెదేపా నేత కళా వెంకట్రావ్ అన్నారు. ర్యాంకులతో మాకు పనిలేదన్న వైకాపా ప్రభుత్వం.... ఈజ్ ఆఫ్ డూయింగ్ ఘనత తమదేనని చెప్పుకోవడం తగదని అభిప్రాయపడ్డారు. సులభతర వాణిజ్యంలో ఏపీకి ర్యాంకు తెచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. వైకాపా అధికారంలో వచ్చాక చేసిందేమి లేదని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి:మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా?: యనమల