ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP leaders reacts on Kalyanadurgam Issue: కల్యాణదుర్గంలో చిన్నారి మృతిపై తెదేపా నేతల మండిపాటు - కల్యాణదుర్గంలో చిన్నారి మృతిపై తెదేపా నేతల మండిపాటు

TDP leaders reacts on Kalyanadurgam Issue: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ ర్యాలీ సందర్భంగా వాహనాలు నిలిచిపోయి.. ఆస్పత్రికి వెళ్తున్న చిన్నారి మృతిచెందడంపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీలు, సంబరాలతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని పార్టీ అధినేత చంద్రబాబు, నేేతలు మండిపడ్డారు.

TDP leaders reacts on Kalyanadurgam girl dead issue
కల్యాణదుర్గంలో చిన్నారి మృతిపై తెదేపా నేతల మండిపాటు

By

Published : Apr 16, 2022, 11:57 AM IST

TDP leaders reacts on Kalyanadurgam Issue: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటంతో పసిబిడ్డ ప్రాణాలు పోవడం కలిచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేయడం వల్లే సకాలంలో వైద్యం అందక చిన్నారి ప్రాణాలు విడిచిందని విమర్శించారు.

అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెబుతారని చంద్రబాబు మండిపడ్డారు. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని ప్రాధేయపడినా, పోలీసులు వదలకపోవడంతోనే నడిరోడ్డుపైనే చిన్నారి కన్నుమూసిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ర్యాలీలు, సంబరాలతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతల కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. కనీసం మంత్రి బాధితులను పరామర్శించ లేదని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details