TDP Leaders protes: "తెదేపా పాలనలో... ఒక్కసారీ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
జగన్ పాలన అంతా 'బాదుడే బాదుడు' అని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. తెదేపా పాలనలో ఒక్కసారి కూడా ప్రజలపై భారం పడలేదని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు.
జగన్ పాలన అంతా బాదుడే బాదుడు అని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడేలా ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని వెల్లడించారు. తెదేపా పిలుపులో భాగంగా జగన్ పాలన అంతా బాదుడే బాదుడు. అని విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి కరకట్ట గ్రామంలో పర్యటించిన దేవినేని... ఇంటింటికీ కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Protest on Power cuts: విద్యుత్ కోతలపై.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు