TDP Protests: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. తెదేపా నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. బాదుడే బాదుడు పథకానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు.
TDP Protests: "బాదుడే బాదుడు పథకానికి.. బ్రాండ్ అంబాసిడర్ జగన్": తెదేపా - విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన
TDP Protests: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా నేతల కొవ్వొత్తుల ర్యాలీ
విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ.. ఇబ్రహీంపట్నంలో దేవినేని ఉమ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు లాంతర్లు, విసనకర్రలతో నిరసన తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఛార్జీలు పెంచి పేదలకు ఉగాది కానుక ఇచ్చారని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:TRANSCO: 'వారికి విద్యుత్ ఛార్జీల భారం స్వల్పమే': ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్