ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాడు జై భారత్‌ అంటే కేసులు... నేడు జై అమరావతి అంటే కేసులు' - విద్యార్థులపై నందిగామ సురేష్ కేసు న్యూస్

బాపట్ల ఎంపీ సురేశ్​పై దాడి జరిగిందనటం అవాస్తవమని తెదేపా నేతలు అన్నారు. నిరసనను దాడిగా చిత్రీకరించి విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు.

tdp leaders on nandigama suresh
tdp leaders on nandigama suresh

By

Published : Feb 4, 2020, 9:52 AM IST

నందిగామలో టీఎన్​ఎస్​ఎప్​ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంపీ సురేశ్​కి పూలు ఇచ్చి.. అమరావతికి మద్దతు తెలపాలని మాత్రమే కోరారని.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి.. వారి భవిష్యత్​ నాశనం చేయడం సరికాదన్నారు. తెదేపా దళితులకు అండగా ఉంటుందని... దాడి చేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. ఎంపీపై దాడి జరిగితే.. వీడియోలు బయటపెట్టాలన్నారు. ఆంగ్లేయుల పాలనలో జై భారత్‌ అంటే కేసులు పెట్టారని... ఇప్పుడు వైకాపా పాలనలో జై అమరావతి అంటే కేసులు పెడుతున్నారని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా నేత పిల్లి మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు.

'విద్యార్థుల భవిష్యత్ నాశనం చేయడం సరికాదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details