ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. మహానాడుకు చీమలదండులా పోటెత్తుతారు: అచ్చెన్నాయుడు - మహానాడుపై అచ్చెన్న కామెంట్స్

Atchenna On TDP Mahanadu: తెదేపా మహానాడుకు వాహనాలు ఇస్తే వాటిని సీజ్ చేస్తామని ప్రైవేటు వాహనాల యజమానులను ఆర్టీవోలు భయపెడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న ఆరోపించారు. మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చీమలదండులా తెదేపా కార్యకర్తలు మహానాడుకు పోటెత్తడం ఖాయమన్నారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. చీమలదండులా పోటెత్తటం ఖాయం
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. చీమలదండులా పోటెత్తటం ఖాయం

By

Published : May 24, 2022, 4:27 PM IST

TDP Mahanadu: మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటామని చలానా కడితే.. ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి రద్దీ అంటూ సాకులు చెప్తున్నారని ఆక్షేపించారు. మహానాడుకు వాహనాలు ఇస్తే వాటిని సీజ్ చేస్తామని ప్రైవేటు వాహనాల యజమానులను ఆర్టీవోలు భయపెడుతున్నారని తెలిపారు. అలా బెదిరించిన అధికారుల వివరాలు సేకరించామని.. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్న హెచ్చరించారు.

గత 40ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున మహానాడుకు శ్రేణులు సమాయత్తమవుతున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చీమలదండులా తెదేపా కార్యకర్తలు మహానాడుకు పోటెత్తడం ఖాయమన్నారు. మూడేళ్ల ప్రభుత్వ అరాచక పాలనపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అందుకే మహానాడు విజయవంతం కాకుండా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details