ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబు దూరదృష్టి వల్లే కనకదుర్గ వంతెన' - కనక దుర్గ ఫ్లే ఓవర్ ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ న్యూస్

చంద్రబాబు దూరదృష్టి వల్లే కనకదుర్గ పైవంతెన నిర్మాణం సాధ్యమైందని మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 85 శాతం పూర్తిఅయితే,15 శాతం మాత్రమే వైకాపా పూర్తి చేసి గొప్పలు చెప్పుకొంటుందని మండిపడ్డారు.

'చంద్రబాబు దూరదృష్టి వల్లే కనకదుర్గ వంతెన'
'చంద్రబాబు దూరదృష్టి వల్లే కనకదుర్గ వంతెన'

By

Published : Oct 17, 2020, 6:43 AM IST

కనకదుర్గ పై వంతెనపై దేవినేని ఉమా, తెదేపా నాయకులతో కలిసి భవానీపురం నుంచి కృష్ణలంక వరకు పాదయాత్ర చేశారు. ఆనాడు కనక దుర్గ పైవంతెన పేరు పెట్టి సరిపోయిందని.. లేకపోతే దీనిపై విగ్రహాలు పెట్టి వైఎస్ఆర్ పైవంతెన అని పేరు పెట్టుకునే వాళ్లని దేవినేని విమర్శించారు.

కేశినేని నాని ప్రత్యేక శ్రద్ధతోనే ఫ్లై ఓవర్

తెదేపా నాయకుల పోరాటం వల్లే కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తై విజయవాడకి ఉన్న దీర్ఘకాలిక సమస్య తీరిందని తెలుగుదేశం నేతలు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీమంత్రి నెట్టెం రఘురామ్ తెలిపారు. వంతెన ప్రారంభమైన సందర్భంగా తెదేపా శ్రేణులు విజయవాడ కేశినేని భవన్​లో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

కేశినేని నాని తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం సాకారమైందన్నారు. అభివృద్ధి అనే మాటకు వైకాపా ప్రభుత్వం స్థానం లేకుండా చేసిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి, నితిన్ గడ్కరీకి తెదేపా నేతలు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:'అన్నీ బయటకు వచ్చేశాయి..సవరించాల్సిన అవసరం ఏముంది'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details