పరిషత్ ఎన్నికలను నిలుపదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్నే అమలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రోజే ఎస్ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించటంలో అర్థం లేదని విమర్శించారు.
పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ వచ్చేలా తెదేపా కృషి చేస్తుందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన స్టే ప్రభుత్వానికి మరో చెంపపెట్టని పేర్కొన్నారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా.. ప్రభుత్వం తన పంథా మార్చుకోవట్లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల బహిష్కరణపై చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.