అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుండగా.. ఆయన్ను సబ్ జైలుకు పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.
'ఒక్కరోజైనా అచ్చెన్నాయుడును జైలులో పెట్టాలనే కుట్రపూరితంగా, నిబంధనలకు వ్యతిరేకంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అచ్చెన్న అరెస్ట్ జరిగింది. వైకాపా ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు.'-- కాల్వ శ్రీనివాసులు, గద్దె రామ్మోహన్, తెదేపా నేతలు
బీసీలను అణగదొక్కాలనే
బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్రలో భాగంగానే అచ్చెన్నాయుడిపై జగన్ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. అచ్చెన్న ఆరోగ్యం పూర్తిగా కుదటపడకముందే ఆయన్ను డిశ్చార్జ్ చేయించి జైలుకు పంపాలని జగన్ ఆరాటపడుతున్నారని విమర్శించారు.
నియంత అనే పదం జగనని చూసే పుట్టినట్టుందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరారావు విమర్శించారు.