అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో.. దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు తగ్గుతుంటే రాష్ట్రంలో మాత్రమే పెరుగుతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి మహమ్మద్ నజీర్ అహ్మద్ మండిపడ్డారు. విద్యుత్ వినియోగదారుల్ని.. వైకాపా ప్రభుత్వం ట్రూఅప్ విధానంతో దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ధరలు చూసి.. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి.. రూ.25వేల కోట్ల రుణాలు తెచ్చి కూడా అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. రెండున్నరేళ్లలోనే రూ.9,069కోట్లు ప్రజలపై దొడ్డిదారిన భారం మోపారని ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే.. ప్రజాతిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
పెంచిన ఛార్జీలు తగ్గించకుంటే తిరగపడతారు: బోండా ఉమా