ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి'...గవర్నర్​కు తెదేపా వినతి - ఏపీలో పంచాయతీ ఎన్నికలు 2021 వార్తలు

ఎన్నికలు సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​​ను తెదేపా కోరింది. సోమవారం రాజ్​భవన్​లో గవర్నర్​ను ఆ పార్టీ నేతల బృందం కలిసింది. ఎన్నికల సంఘాన్ని నియంత్రించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేసింది.

tdp-leaders-meets-governer-bishwabushan
tdp-leaders-meets-governer-bishwabushan

By

Published : Jan 25, 2021, 8:51 PM IST

రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా తక్షణమే జోక్యం చేసుకోవాలని తెదేపా నేతలు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కోరారు. సోమవారం రాజ్​భవన్​లో గవర్నర్​తో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ రాజులు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు... రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నడుస్తోందంటూ ఫిర్యాదు చేశామన్నారు.

గవర్నర్​తో భేటీ అనంతరం మీడియాతో తెదేపా నేతలు

'ఎన్నికల సంఘాన్ని నియంత్రించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరగకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోతారు. ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోంది. రాజ్యాంగ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని కాపాడి, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలి' అని గవర్నర్​కు ఇచ్చిన లేఖలో తెదేపా పేర్కొంది.

ఇదీ చదవండి:సీఎం జగన్ డైరక్షన్​లో రాజ్యాంగ ఉల్లంఘనలు: తెదేపా

ABOUT THE AUTHOR

...view details