నామినేషన్ల ప్రక్రియలో(nominations system) అక్రమాలపై ఎస్‌ఈసీకి తెదేపా నేతలు ఫిర్యాదు(TDP leaders complaint to SEC) చేశారు. వైకాపాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆలపాటి రాజా(alapati raja) ఆరోపించారు. పలు చోట్లు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తెదేపా అభ్యర్థులను వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు.
TDP leaders : 'కుప్పం ప్రత్యేక అధికారి వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నారు'
ఎస్ఈసీ నీలం సాహ్ని(SEC neelam sahni)ని తెదేపా నేతలు(TDP leaders) కలిశారు. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. కుప్పం ప్రత్యేక అధికారి లోకేశ్ వర్మ(lokesh varma) వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆక్షేపించారు. కుప్పంలో లోకేశ్ వర్మను తప్పించాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేతలు
కుప్పంలో తెదేపా అభ్యర్థిపై వైకాపా నాయకులు దాడి(YCP leaders on TDP leaders) చేశారని, ప్రత్యేక ఎన్నికల అధికారి లోకేశ్‌వర్మను తప్పించాలని డిమాండ్ చేశారు. రాజాకుప్పంలో వైకాపా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సభ నిర్వహించిందన్న తెదేపా నేతలు... కుప్పం ప్రత్యేక అధికారి వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆక్షేపించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఎస్ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీచదవండి.