ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటిలాగే పోరాడుతాం: తెదేపా - TDP leader ashok babu

గతంలో మండలి రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గడం వెనుక గుట్టేంటని.... తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. పెద్దల సభలో జనానికి ఉపయోగపడే నిర్ణయాలు చేయాలన్న ఆలోచన లేదని విమర్శించారు.

తెదేపా
తెదేపా

By

Published : Nov 24, 2021, 7:40 AM IST

గతంలో మండలి రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గడం వెనుక గుట్టేంటని.... తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పెద్దల సభలో జనానికి ఉపయోగపడే నిర్ణయాలు చేయాలన్న ఆలోచన లేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటిలానే పోరాడుతామని తేల్చిచెప్పారు.

అధికార బలం ఉందనే అహంకారంతో పాలన చేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న విమర్శించారు. అమరావతిని రాజధానిగా అప్పుడు మద్దతు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పాడని మండిపడ్డారు. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకుని... మంచి పాలన అందించాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:

Chandrababu Tour: వరద బాధితులకు అండగా ఉంటామన్న చంద్రబాబు.. నేడు చిత్తూరులో పర్యటన

ABOUT THE AUTHOR

...view details