TDP leaders house arrest: బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించకుండా.. తెదేపా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనకుండా.. కృష్ణా-గుంటూరు జిల్లా తెదేపా నేతల్ని గృహ నిర్బంధం చేశారు.
TDP leaders house arrest: అన్న క్యాంటీన్లు ప్రారంభించకుండా తెదేపా నేతల గృహనిర్భంధాలు - తెదేపా నేతల గృహనిర్భందం
TDP leaders house arrest: బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించకుండా.. తెదేపా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ జన్మదిన సందర్భంగా మంగళగిరిలో అన్న క్యాంటిన్ ప్రారంభించాలని తెదేపా నిర్ణయించింది. కాగా.. కృష్ణా-గుంటూరు జిల్లా తెదేపా నేతల్ని గృహ నిర్బంధం చేశారు.
అన్న క్యాంటీన్లు ప్రారంభించకుండా తెదేపా నేతల గృహనిర్భంధాలు
బాలకృష్ణ జన్మదిన సందర్భంగా మంగళగిరిలో అన్న క్యాంటిన్ ప్రారంభించాలని తెదేపా నిర్ణయించింది. అయితే ఆ క్యాంటిన్ ను మున్సిపల్ సిబ్బంది నిన్న తొలగించారు. అయినప్పటికీ అన్నదాన కార్యక్రమం నిర్వహణకు తెదేపా నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఆయా జిల్లాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్ బాబు, విజయవాడలో వర్ల రామయ్య, మంగళగిరిలో స్థానిక తెదేపా నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: