గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాగా ఉన్న.. 10.4 శాతం షేర్లను అదానీ గ్రూపునకు అప్పగించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. రూ. 3వేల కోట్ల విలువైన ప్రభుత్వ షేర్లను కేవలం రూ. 645కోట్లకే అదానీ పరంచేశారని మండిపడ్డారు. ఏటా రూ. 1050కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న పోర్టును అమ్మాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. పోర్టు అభివృద్ధి చెందితే తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తే.. జగన్ దాన్ని ప్రైవేట్ పరం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగవరం పోర్టు.. కృష్ణపట్నం, కాకినాడ పోర్టు.. ఇలా అన్నీ ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్రాన్ని ఏం చేయాలని జగన్ భావిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలను.. తన దోపిడీ వనరుగా మార్చుకున్నారు: మర్రెడ్డి
అబద్ధాలు, మోసకారీ తనంతో పబ్బం గడుపుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని ప్రజలు ఎల్లకాలం నమ్మరని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు రూ. 10 ఇచ్చి రూ. 100 వసూలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే దేశంలో ఎక్కడాలేని విధంగా చమురు ధరలు తగ్గిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు రాష్ట్రాన్ని పెట్రోడీజిల్ ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని మండిపడ్డారు. చమురు ధరలు ఇష్టానుసారం పెంచేసి.. ప్రజలను తన దోపిడీ వనరులుగా మార్చుకున్న ప్రభుత్వతీరుని తెదేపా తీవ్రంగా ఆక్షేపిస్తోందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించి, వ్యవసాయరంగానికి 50శాతం సబ్సిడీపై డీజిల్ అందించాలని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
తలనీలాల వ్యవహారంలో వైకాపా పెద్దల హస్తం: మాణిక్యరావు