ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP On TIDCO Houses: టిడ్కో ఎండీకి తెదేపా నేతల వినతిపత్రం - ap latest news

TDP leaders on TIDCO houses: తెదేపా హయాంలో పేదలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను.. లబ్ధిదారులకు ఇవ్వాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. విజయవాడలో టిడ్కో ఎండీ శ్రీధర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.

Tdp leaders gave memorandum to TIDCO MD Sridhar reddy
టిడ్కో ఎండీకి తెదేపా నేతల వినతిపత్రం

By

Published : Feb 14, 2022, 3:51 PM IST

TDP leaders on TIDCO houses: తెదేపా హయాంలో పేదలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను.. లబ్ధిదారులకు ఇవ్వాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. విజయవాడలో టిడ్కో ఎండీ శ్రీధర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఇళ్ల కోసం పేదలు కట్టిన డబ్బులన్నా తిరిగివ్వాలి లేదా ఇళ్లన్నా కేటాయించాలని ఎండీని కోరినట్లు.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. పేదలు ఇళ్ల కోసం డబ్బులు కట్టారని అన్నారు. మూడేళ్లుగా పేదలను టిడ్కో కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడ్డారు.

ఒక రూపాయి కట్టకుండా జగన్ ఇల్లు కట్టిస్తా అని ఇచ్చిన హామీ ఏమైందని.. బోండా ఉమా ప్రశ్నించారు. విజయవాడలో రూ.16 కోట్ల ఇళ్ల కోసం పేదలు డబ్బులు కట్టారని పార్టీ నేత నాగుల్ మీరా తెలిపారు. వడ్డీతో సహా పేదలకు డబ్బులు తిరిగి ఇవ్వండి లేదా ఇల్లు ఇవ్వండని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details