నూతన ఇసుక విధానం ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారని.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భవన నిర్మాణ రంగంపైనే ఎక్కువ ప్రభావం పడిందని విమర్శించారు. ఉచిత ఇసుక విధానాన్ని నిలిపివేసిన కారణంగా.. ఉపాధి లేక ఎందరో భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కొత్తగా జేపీ వెంచర్స్‌కు ఇసుక రీచ్ అప్పగించడం క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించారు.
నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారు
కమీషన్లకు కక్కుర్తి పడే.. నాసిరకం మద్యాన్ని రాష్ట్రంలో అధిక ధరలకు అమ్ముతున్నారని విమర్శించారు. అధిక ధరలకు మద్యం కొనలేక.. ప్రజలు శానిటైజర్లు తాగి చనిపోతున్నారని ఆరోపించారు. మద్యం తాగకూడదనే ధరలు పెంచామని చెప్తున్న ప్రభుత్వం.. నిత్యావసర వస్తువుల ధరలనూ ప్రజలు ఏం తినకూడదని పెంచిందా అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.