రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందని.. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత(tdp leader vangalapudi anitha fires on ycp) ఆరోపించారు. ఆడబిడ్డలను రక్షించాల్సిన పోలీసులే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్న మహిళలంటే ఈ పోలీసులకు, ప్రభుత్వానికి ఎందుకింత చులకన అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత ఎక్కడుందో, మహిళోద్ధరణ ఎక్కడు జరుగుతోందో వైకాపా మహిళా నేతలే చెప్పాలన్నారు. తెదేపా మహిళా నేతలు స్వప్న, విజయశ్రీ, జానకి, తేజస్వినిల ఇళ్లమీదకు పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేస్తారా? వారు చేసిన తప్పేంటి? అని మండిపడ్డారు. బాబాయ్ లను చంపేసి బాత్ రూమ్లో పడేసి, రక్తపుమరకలు తుడిచే ప్రయత్నం చేశారా? అని అనిత ప్రశ్నించారు.
మా పార్టీకి చెందిన మహిళా నేత నేడు ఆసుపత్రిలో ఉంది. ఆమెకు ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, డీజీపీనే బాధ్యులు. -వంగలపూడి అనిత
చంద్రబాబుపై విమర్శలు సిగ్గుచేటు..
వరదలతో సీమప్రజలు అల్లాడిపోతుంటే స్పందించని ప్రభుత్వం మంత్రులు.. ప్రతిపక్షనేత చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్.రాజు(tdp leader m.s.raju fires on ycp) అన్నారు. తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం కొడాలి నానిని.. చంద్రబాబుని దూషించడానికి వదిలిందన్నారు. వరద బాధితులకు అండగా తానున్నానంటూ చంద్రబాబు నిలవడంతో.. ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోక, ఆయనపై వ్యక్తిగత దూషణలకు సిద్ధమైందన్నారు. ప్రభుత్వం సాగిస్తున్న ఇసుక దందాల వల్లనే.. వరదల్లో 60మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇసుకను పోగేసుకోవాలన్న పాలకులు తాపత్రయమే, 15 గ్రామాలను తుడిచిపెట్టుకుపోయేలా చేసిందని ఎం.ఎస్.రాజు విమర్శించారు.