'హోటళ్లు, టీ దుకాణాలు, కాఫీ షాప్లు బంద్ చేశారు. కానీ జగన్ అన్న మద్యం దుకాణాలు మాత్రం అన్ని వేళలా తెరిచే ఉంటాయి' అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని ట్వీట్ చేశారు.
నిత్యావసరాలకు మాత్రం 3 గంటలు అనుమతిస్తే... మద్యం దుకాణాలకు మాత్రం 8 గంటలు ఎలా అనుమతిస్తారని దేవినేని ఉమ నిలదీశారు. ప్రజా రాజధాని కోసం 140 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులపై నిత్యావసరాల కోసం వెళ్తున్న ప్రజలపై, సాయం చేస్తున్న ప్రతిపక్ష నేతలపై లాక్డౌన్ ఉల్లంఘనల కేసులు పెడుతున్నారని ఉమా మండిపడ్డారు. జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల జరుగుతున్న ఉల్లంఘనలకు ఎవరి మీద కేసు పెట్టాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.