tdp leaders fires on cm jagan: నవంబర్ 17, 18న.. కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ నోటీసు ఇచ్చిన రోజు.. సీఎం బీఏసీలో కూర్చుని చంద్రబాబుని ఎగతాళి చేశారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. వాతావరణ శాఖ ఇచ్చిన నోటీసులు పట్టించుకోకపోవడం వల్లే.. నేడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. సీఎం నిర్లక్ష్య ధోరణి కారణంగా.. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయ్యాక కేంద్రం నుండి వరద సాయం కింద.. రూ. 3205 కోట్ల నిధులు వచ్చాయని.. ఆ లెక్కలన్నీ చెప్పాలని డిమాండ్ చేశారు. నారా భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వహించిన సీఎం జగన్.. ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
tdp leader ramanaidu :5లక్షల మంది విద్యార్థులకు అన్యాయం
ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక.. నాణ్యమైన విద్య అనేది విద్యార్థులకు మిథ్యగా మారిందని.. తెదేపా పొలిట్ బ్యూరోసభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-2019 మధ్య.. చంద్రబాబు ప్రభుత్వం 16లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తే, సీఎం జగన్ నేడు ఆ సంఖ్యను 11లక్షలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు.. జగనన్న విద్యాదీవెన అని పేరుపెట్టిన.. ముఖ్యమంత్రి 5లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకుండా చేసి.. వారు ఆకలితో అలమటించేలా చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని నిలదీశారు. మద్యంపై ఆదాయం వస్తుందని దాన్ని ప్రోత్సహిస్తున్న జగన్ ప్రభుత్వం.. వ్యవసాయంపై ఆదాయం లేదని రాష్రంలో వరివేయొద్దనే దుస్థితికి దిగజారిందని దుయ్యబట్టారు.
ఆడబిడ్డల పొదుపు సొమ్ముకి ఎసరు పెట్టారు