"రాష్ట్రానికి సోకిన అతిపెద్ద ఏ1 వై(ర)ఎస్ 6093" అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఆయువు నిలబడటానికి వాయువు లేక, వైద్యం అందించే నాథుడు లేక, అంత్యక్రియలకు శ్మశానాల్లో ఖాళీలేక... రాష్ట్రాన్ని సీఎం జగన్ శవాల దిబ్బగా మార్చారని మండిపడ్డారు.
"వైరస్‌కి వైఎస్‌కి మధ్యలో ఒక్క అక్షరమే తేడా ఉంది. వైరస్‌ని ఇంటి పేరులో పెట్టుకున్న జగన్‌రెడ్డి చర్యల వల్లే ఏపీలో కరోనా విజృంభిస్తోంది" అని ట్విట్టర్లో మాజీ మంత్రి జవహర్ అన్నారు. "ఫ్యాక్షన్ వైరస్ రాజారెడ్డి, పొలిటికల్ వైరస్ రాజశేఖర్రెడ్డి, కరెప్షన్ వైరస్ జగన్ రెడ్డి" అనీ... వీటన్నింటికీ నారా వ్యాక్సినే కరెక్టని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ల కొనుగోళ్లపై ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పినవన్నీ కట్టుకథలేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆంక్షలు ఉన్నాయని సజ్జల పొంతనలేని సమాదానాలు చెబుతున్నారన్నారు. సంబంధించి ఆధారాలుంటే చూపాలన్నారు.