ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP On YSRCP Govt: మద్యం ధరల తగ్గింపు.. అందుకోసమేనా..? : తెదేపా

TDP Leaders On YSRCP Govt Policies: వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఓటీఎస్ పేరుతో వసూళ్లకు పాల్పడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు షాకిచ్చేలా ఉంటేనే.. మద్యం తాగడం తగ్గిస్తారని గతంలో ధరలు పెంచిన సీఎం జగన్‌.. ఇప్పుడు ఎందుకు తగ్గించారో చెప్పాలని తెదేపా మహిళా నేత అనిత ప్రశ్నించారు. కరోనా జాగ్రత్త చర్యలపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.

మద్యం ధరల తగ్గింపు నిర్ణయం అందుకోసమేనా..?
మద్యం ధరల తగ్గింపు నిర్ణయం అందుకోసమేనా..?

By

Published : Dec 19, 2021, 3:37 PM IST

TDP Leaders On YSRCP Govt Policies: వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధరలు షాక్‌ కొట్టేలా ఉంటేనే మద్యం తాగడం తగ్గుతుందని గతంలో ధరలు పెంచిన సీఎం జగన్‌.. ఇప్పుడు ఎందుకు తగ్గించారని తెదేపా మహిళా నేత అనిత ప్రశ్నించారు. మద్యపానాన్ని ప్రోత్సహించటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని ప్రశ్నించిన వైకాపా మహిళా నేతలు.. ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదన్నారు. మద్యం విక్రయంతో వచ్చే సొమ్ముతోనే ప్రభుత్వం నడుస్తుందన్న మరో నేత జవహర్‌.. నిషేధం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.

ఓటీఎస్ పేరుతో వసూళ్లు..
వైకాపా ప్రభుత్వాన్ని వన్ టైం వండర్​గానే ప్రజలు చూస్తారని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు. ఓటీఎస్ విధానంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దాదాపు 40 ఏళ్ల కిందట ఎన్టీ రామారావు హయంలో నిర్మించిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో ఇప్పుడు డబ్బులు దండుకోవటం ఏంటని ప్రశ్నించారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఓటీఎస్ పేరుతో వసూళ్లకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. ఓటీఎస్​పై రేపటి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా..?
ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్​కు లెక్కలేకుండా పోయిందని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైనా.. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలు జాగ్రత్త చర్యల్లో ముందుంటే.. ఏపీ ప్రభుత్వం విపక్షాలను వేధించడంలో ముందుందని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో 5వ స్థానం, టీకా పంపిణీలో 10వ స్థానంలో ఉన్నామన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన శూన్యమని విదేశాల నుంచీ వచ్చే ప్రయాణికులను నామమాత్రంగా టెస్టులు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

వారి బాధలు పట్టవా..?
రాష్ట్ర సమస్యలు, వ్యాపారుల బాధలు సీఎం జగన్​కు పట్టవా అని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్ ప్రశ్నించారు. వస్త్రాలపై 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది వస్త్ర వ్యాపారులు, సామాన్యులపై భారం పడుతుందన్నారు. కొవిడ్ వల్ల కొనుగోల్లు తగ్గి వస్త్ర వ్యాపారులు ఇప్పటికే దివాళా తీసారని, ఇప్పుడు జీఎస్టీ పెంచటం వల్ల దుకాణాలు మూసేసి పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని వైకాపా ఎంపీలు పార్లమెంట్​లో ఎందుకు ప్రస్తావించటం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లి పెంచిన జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరాలన్నారు. తెదేపా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో పెంచిన జీఎస్టీకి నిరసనగా మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యాపార సంఘాలను కలుపుకుని నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

Nara bhuvaneshwari tour: రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటన

ABOUT THE AUTHOR

...view details