కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలకు నిదర్శనమే.. ఎంపీ విజయసాయి రెడ్డికి ఇచ్చిన పదవి అని మాజీమంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ ఆరోపించారు. ఆర్థిక నేరాల్లో అగ్రగణ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని పీఏసీ సభ్యుడిగా నియమించడమేంటని ప్రశ్నించారు. నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రభుత్వం నేతన్న మోసానికి పాల్పడుతోందని మాజీమంత్రి నిమ్మల కిష్టప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో 3లక్షల 50 వేల కుటుంబాలుంటే కేవలం 80 వేల కుటుంబాలకు మాత్రమే నేతన్న నేస్తం ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP: వైకాపా ప్రభుత్వం వైఖరిపై తెదేపా నేతల ఆగ్రహం
వైకాపా ప్రభుత్వ(YCP leaders) వైఖరిపై తెదేపా నేతలు ఎన్ఎమ్డీ ఫరూక్(NMD farkooq), కూన రవికుమార్(koona ravikumar), నిమ్మల కిష్టప్ప(nimmala kishtappa), పిల్లి మాణిక్యరావు(pilli manikyarao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, వైకాపాల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలకు నిదర్శనమే... విజయసాయిరెడ్డిని పీఏసీ సభ్యుడిగా నియమించడమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు.
వైకాపా పాలనలో దళితుల గొంతు నొక్కుతున్నారని తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రవికుమార్.. దళితులపై ప్రైవేట్ వ్యక్తులతో పాటు పోలీసులు కూడా దాడులు చేస్తున్నారని వివరించారు. పులివెందులలో అశోక్ మృతికి కారణమైన పోలీసులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని తెదేపా నేత పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా అంతిమసంస్కారాలు ఎలా జరిపారని ప్రశ్నించారు. ఈ ఘటనతో వైఎస్ వివేకా హత్యకు సంబంధాలున్నాయనే అనుమానం కలుగుతుందన్నారు.
ఇదీచదవండి.