జగన్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నాశనమైందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (kommareddy pattabhiram) అన్నారు. విద్యుత్ వ్యవస్థ సరిగా లేకపోతే.. రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకు ఉపాధి ఎలా వస్తాయని ప్రశ్నించారు. జగన్ రెడ్డి రివర్స్ గేర్ పరిపాలన(reverse gare ruling)లో ప్రజలు లాంతర్లు పట్టుకొని తిరిగే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. వారం రోజుల్లోనే విద్యుత్ అంశంపై ముఖ్యమంత్రి గేర్ మార్చారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో అంధకారం..
'జగనన్న బాదుడే బాదుడు' పథకాన్ని వెంటనే రద్దు చెయ్యాలని తెదేపా సీనియర్ నేత జీ.వీ. ఆంజనేయులు(GV.Anjaneyulu) ఎద్దేవా చేశారు. జగన్ చేతికి పవర్ ఇస్తే.. జనానికి పవర్ లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో ఇప్పటి వరకు 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, ప్రజలపై అదనపు భారం మోపారని మండిపడ్డారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీల వినియోగాన్ని తగ్గించాలంటున్న ప్రభుత్వ ప్రకటనను చూస్తుంటే.. త్వరలోనే రాష్ట్రం అంధకారం కాబోతోందన్న విషయం అర్ధమవుతోందన్నారు. కరెంట్ బిల్లులు కట్టడానికి ప్రజలకు జగన్ రెడ్డి అప్పులు(loans) ఇప్పించాలని ఆక్షేపించారు. ఫ్యాన్(fan) గుర్తుకు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేకుండా చేశారని జీవీ.ఆంజనేయులు ధ్వజమెత్తారు.