ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 6, 2021, 8:32 PM IST

ETV Bharat / city

వైకాపా కనుసన్నల్లోనే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ: తెదేపా నేతలు

ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుందని తెదేపా నేతలు ఆరోపించారు. రూ. లక్ష కోట్ల స్కెచ్​లో భాగంగానే స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతోందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

tdp leaders fire on ycp due to vizag steel plant
వైకాపా కనుసన్నల్లోనే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. రూ. లక్ష కోట్ల ఆస్తిని 2009లోనే సంపాదించారని... అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం జరుగుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్​ను తన బినామీల చేతిల్లోకి వచ్చేలా చేసి బాక్సైట్ మైనింగ్​ను ఆ కంపెనీకి అప్పగించే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. ఇది రూ. లక్షల కోట్ల అతి భారీ కుంభకోణమని ఆయన విమర్శించారు. జగన్​లో మరో ఓబులాపురం, గాలి జనార్థన్​రెడ్డి చూడబోతున్నామన్న అయ్యన్న.. ఈ కుట్రను ఉత్తరాంధ్రతోపాటు, 5 కోట్ల ఆంధ్రులు అడ్డుకుంటారని ట్విట్టర్ ద్వారా తేల్చిచెప్పారు.

విషపురెడ్డి బ్రోకర్ ఉద్యోగం చేస్తున్నారు.... !

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే బ్రోకర్ ఉద్యోగం చేసేది విషపురెడ్డేనని తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర విమర్శలు చేశారు. ' ఉత్తరాంధ్ర కింగ్ అని కూస్తున్న విజయసాయి రెడ్డి మాట్లడడే... విశాఖలో జరుగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అణిచివేసే కుట్ర చేస్తున్నారు. కార్మిక, పౌర సంఘాలను భయపెడుతున్నారు. విషపురెడ్డికి ఎవరూ లొంగరు. మా ఉత్తరాంధ్ర సెంటిమెంట్ నీకు అర్ధం కాదు' అని ట్విట్టర్​ వేదికగా హెచ్చరించారు.

వైకాపా చేతకాని తనం వల్లే...

వైకాపా ఎంపీల చేతకానితనం వల్లే విశాఖ ఉక్కును కేంద్రం అమ్మకానికి పెట్టిందని తెదేపా అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి విమర్శించారు. కేంద్రం ప్రకటన వచ్చినప్పుడు పార్లమెంట్​లో నిరసన తెలపలేని ఎంపీలు రాష్ట్రానికి అవసరమా. గత 20నెలలుగా వైకాపా ఎంపీల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజన లేదని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు.

ఇదీచూడండి:పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంతా రాజీనామా చేయాలి: గంటా

ABOUT THE AUTHOR

...view details