మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలతో.. రాధా హత్యకు రెక్కీ నిర్వహించింది వైకాపా ప్రభుత్వమేనని అర్థమైందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు. రాధా హత్యకు రెక్కీ ఘటనపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాధాపై విషపు ప్రేమను ప్రదర్శిస్తున్నారని అన్నారు.
TDP LEADERS : "మంత్రి వ్యాఖ్యలతో.. రాధా హత్యకు రెక్కీ నిర్వహించింది వైకాపానే అనిపిస్తోంది" - tdp leader pilli manikyalarao
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై తెదేపా నేతలు పిల్లి మాణిక్యాలరావు, బుద్దావెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వాడే భాషకు భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
తెదేపా
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సొంత డివిజన్లో గెలిచిన ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి)పై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమానికి పిలవలేదని అడిగితే దూషిస్తారా? అని ప్రశ్నించారు. మంత్రి వెల్లంపల్లి వాడే భాషకు భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ఇదీచదవండి :