ముఖ్యమంత్రి జగన్ మెుండి వైఖరితో నదీజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెదేపా ముఖ్యనేతల సమావేశంలో నేతలు వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ అంశంపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో వ్యవసాయరంగ అభివృద్ధికి ఇది గొడ్డలిపెట్టు కానుందని అభిప్రాయపడ్డారు.
లేఖలు రాస్తూ జగన్ చేసేది కాలక్షేపమేనని నేతలు ఎద్దేవా చేశారు. కేసులకు భయపడి నదీజలాలపై రాష్ట్ర హక్కులను దారాదత్తం చేస్తున్న జగన్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసేంత వరకు టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత ఆందోళనలు కొసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. నిరుద్యోగులు, విద్యార్థుల అక్రమ అరెస్టుల్ని ఖండిస్తున్నట్లు నేతలు స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అమరావతి ఉద్ధండరాయినిపాలెంలో ఐకాన్ బ్రిడ్జి ప్లాట్‌ఫాంను ధ్వంసం చేయడాన్ని వారు తప్పుపట్టారు.