TDP Leaders: రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంలో రసాయనాలు ఉన్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలన్నీ బయటపెడతామని నేతలు ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కీలక మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద మద్యం స్కాంపై సంచలన అంశాలు బహిర్గతం చేయనున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు.
మద్యం మాఫియా ఆధారాలన్నీ బయటపెడతాం : తెదేపా - latest news in andhra pradesh
TDP Leaders: రాష్ట్రంలో అతిపెద్ద మద్యం స్కాంపై సంచలన అంశాలు బహిర్గతం చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కీలక మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మద్యం మాఫియాపై అన్ని ఆధారాలు బయటపెడతాం
మూడేళ్లలో జరిగిన అధికారిక దోపిడీపై కీలక అంశాలతో ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పారు. జె బ్రాండ్స్ నుంచి అధిక ధరల వరకు మద్యానికి సంబంధించిన అన్ని అక్రమాల వివరాలనూ ప్రజల ముందు ఉంచుతామన్నారు. సభలో గత ఎనిమిది రోజులుగా దీనిపై పోరాడుతున్నా.. ప్రభుత్వం చర్చకు అవకాశం ఇవ్వకపోగా తమను అకారణంగా సస్పెండ్ చేసిసందుకే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెడుతున్నట్లు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Nara Lokesh : సీఎం జగన్కు నారా లోకేశ్ సవాల్.. ఏమన్నారంటే?