ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వాలంటీర్లపై లాఠీలు ఝుళిపించడం అమానుషం' - అనగాని సత్యప్రసాద్​ వ్యాఖ్యలు

వాలంటీర్లకు వేతనాలు పెంచుతామన్న సీఎం.. ఇప్పుడు వారిని హింసిస్తున్నారని తెదేపా నేతలు దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం జీతాలు ఎందుకు పెంచలేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

tdp leaders on volunteers demand
'వాలంటీర్లపై లాఠీలు ఝుళిపించడం అమానుషం'

By

Published : Feb 8, 2021, 9:30 PM IST

వాలంటీర్లకిచ్చిన జీతాల పెంపు హామీని సీఎం జగన్​ ఎందుకు పట్టించుకోవట్లేదో సమాధానం చెప్పాలని.. తెదేపా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అనగాని సత్యప్రసాద్​ ప్రశ్నించారు. వాడుకుని అన్యాయం చేసే నైజాన్ని చిరుద్యోగులపై చూపటం అత్యంత హేయమని దుయ్యబట్టారు. ప్రతి ప్రభుత్వ పనికీ వాలంటీర్లను వాడుకుని వేతనాల చెల్లింపులో వివక్ష చూపటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

ఏడాది క్రితమే వేతనాలను రూ. 8 వేల రూపాయలకు పెంచుతామని ప్రకటించి.. ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. ఇటీవలే ప్రారంభించిన రేషన్ వాహనాల నిర్వహణ, వారి వేతనాలను ఒక్కసారిగా రూ. 5 వేలు పెంచి వాలంటీర్లపై లాఠీలు ఝుళిపించడం, హింసించడం ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనమంటూ నేతలు మండిపడ్డారు. వెంటనే వాలంటీర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details