NTR's daughter Uma Maheswari Death: ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వైకాపా, తెదేపా మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. ఆస్తి కోసం చంద్రబాబు కుటుంబమే.. ఉమామహేశ్వరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ వైకాపా నేతలు కిరాయిగాళ్లతో సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం చేస్తున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lokesh on YSRCP: చిన్నమ్మ మరణంపై డోర్ నెంబర్‌కి సర్వే నెంబర్‌కి తేడా తెలియని కిరాయిగాళ్లతో విషప్రచారం చేయిస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. చిన్నమ్మ మరణంతో తాము విషాదంలో ఉంటే.. విషప్రచారం చేస్తూ వినోదం పొందుతున్న జగన్ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ దగ్గర పడిందన్నారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ నాటకమాడారని మండిపడ్డారు. తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని సంతకాలు చేసిన నీచ చరిత్ర జగన్‌దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ మర్డర్‌నీ వాడుకున్నారని ఆరోపించారు.