TDP Leaders Fire YSRCP Govt: రాష్ట్రంలో భౌతిక, రాజకీయ అరాచకంతోపాటు ఆర్థిక అరాచకం కూడా పెరిగిపోతోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. ప్రభుత్వం చేసే ఆర్థిక నేరాలతో తాము ఎలా నష్టపోతున్నామో కూడా ప్రజలకు తెలియట్లేదని అన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు తీర్చేందుకు ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం మోపారని మండిపడ్డారు. స్కీంలు స్కామ్‌లు తప్ప రాష్ట్రంలో బడ్జెట్ అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐపీ పెట్టే స్థాయికి వచ్చిందని, రేపు రాష్ట్రానిదీ అదే పరిస్థితి అని దుయ్యబట్టారు.
ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోగా.., అణగదొక్కిందని అశోక్‌బాబు విమర్శించారు. ఉద్యోగులు పీఆర్సీ నివేదికను కోర్టు ద్వారా సాధించటంతో రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయిందని అన్నారు. కొవిడ్ వల్ల రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఖర్చు అయిందని సీఎస్ ఉద్యోగులకు చెబితే.., ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో అది రూ.8 వేల కోట్లేనని పేర్కొన్నారని గుర్తు చేశారు. రూ.97 వేల కోట్లు బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఖర్చు చేసినట్లు కాగ్ వెల్లడించినా.. తమకు సంబంధం లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఉన్న అప్పును తీర్చటానికి ఎక్కువ వడ్డీకి మళ్లీ అప్పులు తెస్తున్నారన్నారు.
ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి..