ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తగ్గేదేలే.. మంగళగిరిలో "అన్న క్యాంటీన్" ప్రారంభం - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ANNA CANTEEN: ఎన్నో అడ్డంకులను, నిర్బంధాలను అధిగమించి తెలుగుదేశం నాయకులు మంగళగిరిలో "అన్న క్యాంటీన్‌"ను ప్రారంభించారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు ససేమీరా అన్నా.. నారా లోకేశ్​ పకడ్బందీ వ్యూహంతో తెలుగుదేశం నేతలు అనుకున్నది సాధించారు. పేదలకు ఆకలి తీర్చే ఉద్దేశంతో రెండు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమాన్ని అనుకున్న విధంగా బాలకృష్ణ పుట్టిన రోజు నాడే అందుబాటులోకి తీసుకొచ్చారు.

ANNA CANTEEN
పంతం నెగ్గించుకున్న తెదేపా నేతలు.. వెనక్కి తగ్గకుండా "అన్నా క్యాంటీన్" ప్రారంభం..!

By

Published : Jun 10, 2022, 6:21 PM IST

ANNA CANTEEN:మంగళగిరిలో తెలుగుదేశం నేతలు పంతం నెగ్గించుకున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు ఎంత అడ్డగించినా వెనక్కి తగ్గకుండా.. అనుకున్నట్లే "అన్న క్యాంటీన్"ను ప్రారంభిచారు... పేదలకు పట్టెడన్నం అందిస్తున్నారు. అయితే ఈ క్యాంటీన్ ప్రారంభానికి ముందు మున్సిపల్ అధికారులు, పోలీసుల చర్యలతో మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మంగళగిరి బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ తొలగించిన ప్రాంతంలోనే.. తెలుగుదేశం నేతలు పట్టుదలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంటుకే అన్న క్యాంటీన్ బ్యానర్లు కట్టి.. పేదలకు 2 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. అనుమతి లేదంటూ మున్సిపల్ అధికారులు అభ్యంతరాలు చెప్పినా, క్యాంటీన్ ప్రారంభానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డగించినా.. ఏ మాత్రం వెనక్కి తగ్గని తెలుగుదేశం నాయకులు.. పట్టుదలతో అనుకున్న పని చేశారు. 20 ఏళ్లుగా ఎన్టీఆర్​ విగ్రహం ఉన్న ప్రాంతంలో చలివేంద్రం నిర్వహిస్తున్నామని.. ఇప్పుడు అక్కడే పేదలకు భోజనం పెడతామంటే అడ్డగించడం వైకాపా అరాచకానికి నిదర్శనమని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలే కడుపుతో అల్లాడే వారికి 2 రూపాయలకే భోజనం అందించడం పట్ల.. పేదలు హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ ఖర్చుతో కడుపు నింపుకొనే అవకాశం ఏర్పడిందని సంతోషంగా చెబుతున్నారు.

అంతకుముందు.. మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంటీన్ ప్రారంభించేందుకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్​ విగ్రహం వైపు ర్యాలీగా వచ్చిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తీవ్ర తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల చర్యలను నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. నిన్న మున్సిపల్ అధికారులు బలవంతంగా క్యాంటీన్ తొలగించిన ప్రాంతంలోనే పేదలకు భోజనం పెడతామని పట్టుబట్టారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో మున్సిపల్ కమిషనర్ హేమమాలినిరెడ్డి, పోలీసులు కలిసి.. పేదలకు భోజనం పెడుతుంటే అడ్డుకోవడం దారుణమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.

అన్నా క్యాంటీన్ ప్రారంభానికి వస్తారనే సమాచారంతో.. నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య సహా మంగళగిరిలో ముఖ్యనేతలను ఉదయం నుంచే పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసుల కళ్లుగప్పి ఆనందబాబుతో పాటు మరికొందరు నేతలు.. ఎన్టీఆర్​ విగ్రహం వద్దకు చేరుకుని క్యాంటీన్ ప్రారంభంలో పాల్గొన్నారు.

పంతం నెగ్గించుకున్న తెదేపా నేతలు.. వెనక్కి తగ్గకుండా "అన్నా క్యాంటీన్" ప్రారంభం..!
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details