హోలీ పండుగ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజలందరికీ అనేక సంతోషాలను అందించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని లోకేష్ ఆకాంక్షించారు.
తెలుగు వారందరికీ.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు, ఆయురారోగ్యాలను ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. ప్రకృతి ప్రసాదించే సహజ రంగులతో హోలీ జరపుకోవడమే పండుగ పరమార్ధమన్నారు. సహజ రంగుల్లో ఔషధాలతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనేది పెద్దల ఉవాచ అని వివరించారు. కృత్రిమ రంగులతో పండుగ పరమార్ధాన్ని ప్రశ్నార్ధకం చేయవద్దని కోరారు.